వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తలు

 #వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తలు#

వేసవిలో సాధారణంగా ఎండ  తగిలి  పడిపోవడం వాంతులు విరోచనాలు అవ్వడం శరీరం మీద 

సెగ గడ్డలు ,చెమటకాయలు రావటం వంటి సమస్యలు వస్తాయి . ఇటువంటి సమస్యలు వచ్చిన 

తరువాత చికిత్స చేఇంచు కోవడం కంటె అసలు రాకుండా చూసుకోవడం మంచిది 

వేసవిలో పాటించవలసిన  నియమాలు:

1)మంచినీళ్లు అధికంగా త్రాగాలి:ఆరోగ్యవంతుడైన  మనిషికి రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళ 

అవసరం వుంది.అందులో 3 లీటర్లు మంచినీళ్లగానే త్రాగాలి. ఒక లీటరు ఆహార పదార్దాలు,పీల్చిన 

గాలి జల రూపంలోకి  మారుతుంది. వేసవి కాలంలో శరీరంలో నీరు చెమట రూపంలో, 

ఆవిరిరూపంలో ఎక్కువగా బయటికి వేళ్తుంది. అందువల్ల మనిషి నిరసించిపోవటం,అలసిపోవటం 

జరుగుతుంది. అందువల్ల వేసవిలో  కనీసం 4 లీటర్ల మంచి నీళ్లు త్రాగాలి. నిద్రలేవగానే నోరు  

పుక్కలించి 2 గ్లాసులు ,వ్యాయామం చేసిన తరువాత 2 గ్లాసులు అల్పాహారం అనంతరం అరగంట 

తరువాత నుండి మధ్యాహ్నం భోజనం వరకు 4 గ్లాసులు భోజనం తరువాత అరగంట నుంచి 

సాయంత్రం 6 లోపు 6 గ్లాసులు, రాత్రి 2  గ్లాసులు త్రాగటం మంచిది. ఇలా  మంచినీళ్ళు త్రాగటం 

అలవాటు చేసుకుంటే వేసవిలో ఇబ్బంది రాదు. 

2)మజ్జిగ వాడాలి:వేసవికాలంలో భోజనంలో  మసాలాతో చేసిన కూరలు వాడకూడదు. 

పులుసులు సాంబార్ మానేస్తే మంచిది . కారం ఉప్పు తక్కువ వేసిన ఇగురు కూరలు వేసవిలో

బాగుంటాయి. వేఫుల్లు వేసవిలో తినకూడదు ఇవి దాహాన్ని పెంచుతాయి. వేసవిలో కూరన్నం 

ఎంత తింటామో మజ్జిగన్నం అంత తినాలి. మజ్జిగన్నం చలవ చేస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది . 

ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ సాయంత్రం ఇంటికి 

వచ్చాక ఒక గ్లాసు మజ్జిగ త్రాగితే వేడి చేయకుండా ఉంటుంది. 

3)పండ్ల రసాలు త్రాగాలి:వేసవికాలం పండ్ల రసాలు బజారులో బాగా దొరుకుతాయి. వాటిలో 

ఐస్ వేస్తారు త్రాగేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ త్రాగిన తరువాత దెబ్బతీస్తుంది. పండ్ల 

రసాలు ఐస్ లేకుండా లేదా తక్కువగా వేసుకొని త్రాగటం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లు,నిమ్మ 

రసం,సబ్జా నీళ్లు కూడా త్రాగడం వల్ల  వేసవికాలంలో ఆరోగ్యనికి చాలా మంచిది . 



No comments:

Post a Comment