విజయ సాధన మార్గం:
ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తాను చేపట్టిన కార్యం లో విజయం సాధించాలని
కోరుకుంటాడు ఎందులో ఐనా విజయం సాధించాలి అంటే ప్రతిభతో పాటు ప్రయత్నా
బలం కూడా ఉండాలి . కొందరు అన్నింటికి అదృష్టం ఉండాలి అని భావిస్తారు.
దేనిలోనూ తమ ప్రయత్న బలాన్ని చూపరు . అటువంటి వారు నిరాశ నిస్పృహులకు
లోనుకాక తప్పదు .
"కృషితో నాస్తి దుర్బి క్షం -కష్టే పలే" వంటి సూక్తులు ప్రాచీన కాలం నుండి వున్నవే !
మనిషి కార్య సాధనలో తన శక్తీ మేరకు కష్టించి పనిచేయాలి . ఆ తరువాత ఫలితం
దైవదీనం."కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ,మహా పురుషులు అవుతారు "
అనే కవి వాక్కులు ఎల్లా వేళల స్మరించదగినవి .
ఉద్యోగం లో ఐనా వ్యాపారం లో ఐనా ,చదువులో ఐనా ,ఆటల్లో ఐనా అనుకున్న
లక్ష్యం సాదించటానికి అనుసరించవలిసిన మార్గాలు ఒకే రకంగా ఉంటాయి .
ఈ క్రింద మార్గ దర్శిక సూత్రాలను అనుసరించిన వారు తమ జీవిత గమ్యాన్ని సులువుగా
చేరుకోగలుగుతారు .
1)ముందుగా తన గమ్యం ఏమిటో స్ఫష్టంగా నిర్ణయంచుకోవాలి .
2)ఆ గమ్యాన్ని చేరుకోవటానికి కావలిసిన అవసరాలు ఏమిటో తేలుసుకోవాలి .
3)గమ్యాన్ని చేరుకోవటానికి వున్నా ఆటంకాలేమిటో కూడా తెలుసుకోవాలి .
4)లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది ,రోజుకు ఎంతసమయాన్ని
కేటేంచుకోవాలో నిర్ణయంచుకోవాలి .
5)ఒక లక్ష్యాన్ని నిర్ణయంచుకొని కొంతకాలం ప్రయత్నం చేసి ,విసుగు చెంది మరల
లక్ష్యాన్ని మార్పు చేసుకుంటూ వుంటారు కొందరు .ఇటువంటి వారు ఎన్నటికీ జీవితంలో
విజయం సాధించలేరు.
6)లక్ష్యా సాధనలో నిరాశ నిస్పృహలకు తావివ్వకూడదు.విజయం సాదిస్తాను అనే
దృడ సంకల్పం ఉండాలి .
7)ప్రతిరోజు లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తూనే ఏరోజుకారోజు లక్ష్యాoలో సాధించిన
ప్రగతిని అంచనా వెసుకొని ఆలోచించాలి .
8)లక్ష్యా సాధనలో వ్యక్తిగత ఆరోగ్య మానసిక సమతుల్యత ఎంతో తోడ్పడతాయి. వాటిని
ఎప్పుడు రక్షించుకుంటూ ఉండాలి
Reference:Scientific yoga
No comments:
Post a Comment