వజ్రాసనం వల్ల ఉపయోగాలు

వజ్రాసనం వల్ల ఉపయోగాలు :
1. అజీర్తి తగ్గుతుంది  అరుగుదల ఉంటుంది 
2. మన శరీరం లో  పొట్ట దగ్గర వున్నా కొవ్వును  తగ్గిఇస్తుంది . 
3. నడుం మోకాళ్ళ నొప్పులు  తగ్గుతాయి. 


వజ్రాసనం వేయూ విధానం :








ముందు  మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌వేలిపై కుడికాలి బ్రోట‌న వేలు వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పుగా  చేయాలి. రెండు పాదాల లోప‌లి భాగం సగం చంద్రాకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంలో  కూర్చొవాలి. శ‌రీర పీ్ఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. రెండు చేతులు పైకి ఎత్తి ఎడ‌మ అది చేతిపై, కుడి అరిచేతిని పెట్టి కుడి అర‌చేతిపై ఎడ‌మ అరిచేతిని వుంచి తొడ‌లు క‌లిపి వుంచాలి. మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చ‌కుండా నిశ్చ లంగా వుండాలి. మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ  ఉపయోగం ఉంటుంది . ఆస‌న‌ము నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకున్నపుడు మోకాళ్ల పై నుంచి చేతుల‌కు విరామం క‌లిగించాలి. త‌రువాత ఒక్క కాలిని ఒక్కసారి ఇంకో కాలిని ఒక్కసారి ముందుకు సాంచి ఆసనం నుంచి బ‌య‌ట‌కు రావాలి.




No comments:

Post a Comment